AP News: అనంతపురం జిల్లాలో దేవాలయాల్లో వరుస చోరీలు
అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం లో వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల లోపే దేవాలయాలలో వరుసగా ఆరు చోరీలు జరిగాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకి గురి అవుతున్నారు. అసలు దేవాలయాలలో చోరీలు జరగడం ఏంటి ? దేవుడికే సరైన రక్షణ లేదా ? దేవుడికే దిక్కేది ? ఆలయాల చోరీలను పోలీస్ యంత్రాంగం నిలువరించలేకపోతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీంతో కళ్యాణదుర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది .