CM Nara Chandrababu MLA Oath taking | ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న సీఎం చంద్రబాబు | ABP


సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. 2021లో ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో తిరిగి అడుగుపెడతానని బయటకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల ఆశీర్వాదంతో మూడేళ్ల తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టారు. చంద్రబాబు అసెంబ్లీలో కాలు పెట్టేముందు గడప దగ్గర నమస్కారం చేశారు. కౌరవ సభలా వైసీపీ మార్చిన అసెంబ్లీని తిరిగి గౌరవ సభగా మార్చి చంద్రబాబు వచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండగా చంద్రబాబు అసెంబీల్లో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనభ సమావేశాలు ప్రారంం కాగానే ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. ముందుగా చంద్రబాబు ప్రమాణం చేశారు.చంద్రబాబు శపథాన్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ సభ్యులు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని ప్లకార్డులు పెట్టుకొని నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా అల్ఫాబేటిక్ ఆర్డర్‌లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ముటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola