CM Jagan To Do Yatra In Andhra Pradesh: జగన్ ఎన్నికల ప్రచారానికి తెరలేచేది అప్పుడేనా..?
ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో అప్పుడే రాజకీయం రంజుగా మారుతోంది. మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా అన్ని పార్టీలూ జోరు పెంచాయి. అధికార వైసీపీ ఓవైపు, మరోవైపు టీడీపీ జనసేన కూటమి జనం బాట పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఇన్ఛార్జుల మార్పు ఓవైపు శరవేగంగా చేస్తున్న సీఎం జగన్, జనవరి 21వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దాకా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.