YS Jagan: వర్క్ ఫ్రమ్ విలేజ్ కాన్సెప్ట్ తగ్గట్లుగా డిజిటల్ లైబ్రరీలు
డిజిటల్ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.... గ్రామాల నుంచే వర్క్ చేసేలా వేగవంతమైన అంతరాయం లేని ఇంటర్నెట్ అందించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకూ ఇవి ఉపయోగపడేలా చూడాలని సీఎం సూచించారు. ప్రింటర్లు, స్కానర్లు సహా మౌలిక సదుపాయలపై దృష్టి సారించాలన్నారు. డిసెంబరు 2022 నాటికి ఫేజ్ 2, 2023 జూన్ నాటికి ఫేజ్-3 పూర్తికి ఆదేశం.