CM Jagan Names A Baby In Bhimavaram: ఎంతో అభిమానంతో వచ్చారు, మరి బిడ్డకు ఏం పేరు పెట్టారు..?
కొన్ని నెలల క్రితం ఓ జిల్లా పర్యటనలో భాగంగా... ఓ బాబుకు సీఎం జగన్ దేవుడు అనే పేరు పెట్టారు గుర్తుందిగా. అలాంటి ఘటనే ఇవాళ భీమవరం పర్యటనలోనూ జరిగింది. విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చారు. అక్కడ సోనీ, మోహన్ కుమార్ దంపతులు... తమ ఐదు నెలల చిన్నారితో జగన్ ను కలిసి పేరు పెట్టాలని కోరారు. జగన్ అన్నా, ఆయన తండ్రి వైఎస్సార్ అన్నా ఎంతో అభిమానమని వారు చెప్పటంతో, రాజశేఖర్ పేరు పెడదామని జగన్ వారికి చెప్పి బిడ్డను హత్తుకుని ముద్దాడారు.