CM Jagan Met PM Modi : ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం జగన్ | ABP Desam
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సుడిగాలి సమావేశాలతో ముగిసింది. ఉదయం బయలుదేరి ఢిల్లీ వచ్చిన ఆయన ముందుగా హోంమంత్రి అమిత్ షాతో 45 నిమిషాల సేపు సమావేశం అయ్యారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు. దాదాపుగా గంట సేపు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు.