CM Jagan Meeting With Ministers: కేబినెట్ భేటీలో రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చ
ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. ప్రతిసారి జరిగే సమావేశాలకు భిన్నంగా సీఎం జగన్ గంటన్నర పాటు రాజకీయాలపై మంత్రులతో చర్చించారు. మంత్రులు మరింతగా యాక్టివ్ అవాలని, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వం, పార్టీని బ్యాలెన్స్ చేసుకోవాలని సూచించారు. ఇక వాలంటీర్ల వ్యవస్థపై జరిగే దుష్ప్రచారాన్ని మరింతగా తిప్పికొట్టాలని సీఎం అన్నారు.