CM JAGAN: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి...పీఆర్సీ అమలు విషయంపై చర్చించారు. కోవిడ్ థర్డ్ పరిస్థితిని సమీక్షించి... అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ ను డిక్లేర్ చేయాలని అధికారులకు సూచించారు. జూన్ చివరికల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసి జూలై నుంచి ఉద్యోగులకు కొత్త జీతాలను ఇవ్వాలని ఆదేశించారు. కారుణ్య నియమాకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.