CM Chandrababu on YS Jagan | జగన్ పాలన పోలవరానికి శాపం | ABP Desam
Chandrababu Naidu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొని 2019 నాటికి తాము 70 శాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు వెనక్కి వెళ్లాయని అన్నారు. రాజకీయాల్లోకే అనర్హుడైన వ్యక్తి రాష్ట్రానికే శాపంగా మారాడని వైఎస్ జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. అందుకు పోలవరం ప్రాజెక్టే నిదర్శనమని అన్నారు. డయాఫ్రం వాల్‌ను నాశనం చేశారని అన్నారు.
చంద్రబాబు సోమవారం (జూన్ 17) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. తొలుత వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతిని చంద్రబాబు పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు స్పిల్ వే దగ్గరికి వెళ్లారు. స్పిల్ వే 26వ గేట్ వద్ద పనుల వివరాలను తెలుసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.