
CM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP Desam
పిల్లలని కనండి.. వాళ్లే మీ ఆస్తి.. ఈసారి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచీ చంద్రబాబు చెబుతున్నది ఇదే. ఎవరైనా జనాభా తగ్గించమని చెబుతారు... ఈయనేంటి పెంచమంటున్నారు... కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నారా.. అని ప్రశ్నించేవాళ్లున్నారు. కొంపతీసి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి అంటే ఇదేనా అని ఎద్దేవా చేసేవాళ్లూ లేకపోలేదు.
అసలు చంద్రబాబు ఏం చెప్పారు.. జనాలకు ఏం అర్థమవుతోంది.,? అందులో రాజకీయ విమర్శలు ఏంటనేది పక్కన పెట్టి ఆయన ఎందుకు అలా చెబుతున్నారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు అంత ఆందోళన ఉందన్నది ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను.
పాపులేషన్ డెఫిషిట్ అన్నది ఇప్పుడు చాలా దేశాలను ఇబ్బంది పెడుతున్న సమస్య.. జపాన్, చైనా , సౌత్ కొరియా ఇలా కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ముసలివాళ్లు పెరిగిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఆందోళన పడుతున్నాయి. వయోభారం వల్ల పదేళ్లలో జపాన్ జీడీపీ 1.4శాతం తగ్గిపోయింది. ఇక చైనా సరేసరి. ఇప్పుడు ఆ సమస్య ఇండియాకు పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో దీనితో ఇబ్బంది పడాల్సిందే. దీని గురించి చర్చ జరగాల్సిందే. సహజంగానే పాజిటివ్ థింకింగ్.. ప్యూచర్ అవుట్‌లుక్ ఉన్న చంద్రబాబు దీని గురించి మొదట మాట్లాడారు. ఎన్నికలకు ముందే ఆయన దీని గురించి మాట్లాడటం స్టార్ట్ చేసినా ఎన్నికల తర్వాత ఎక్కువ మీటింగ్‌లలో దీని గురించి చెప్పారు. నిన్నా మొన్నా.. అయితే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలుంటేనే పోటీ కి అవకాశం కల్పించాలేమో అని వ్యాఖ్యలు కూడా చేశారు.