బోట్లు తగిలి ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్లపై సీఎం చంద్రబాబు ఏమన్నారు?

వరదల కారణంగా కృష్ణా నదిలో బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ పాక్షికంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ ఘటన వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అని కూడా విలేకరులు చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఈ అంశంపై ఇప్పుడు నేనేమీ మాట్లాడడని, కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం పైనే ఇప్పుడు తన దృష్టి ఉందని అన్నారు. అలాంటి విషయాలు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదని తెలిపారు. ప్రస్తుతానికి ప్రజల ప్రాణాలు కాపాడటం, వారికి తక్షణ అవసరాలను అందించడంపైనే తాను దృష్టి సారిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం వరదల కారణంగా విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు దాదాపుగా మునిగిపోయాయి. ముఖ్యంగా సింగ్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రస్తుతానికి విజయవాడలో వర్షాలు ఆగాయి. దీంతో ప్రజలకు కాస్త ఊపిరి సలిపే పరిస్థితి నెలకొంది. తిరిగి ప్రజా జీవితం సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola