CM Chandrababu Met Bill gates | దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

 స్విట్టర్జ్ లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన చిరకాల మిత్రుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిశారు. గేట్స్ తో ఆర్టిఫీషియల్ ఇంటిలెజిన్స్ గురించి సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు...AI ఆధారిత ఇండస్ట్రీస్ ను ఏపీ వైపు ప్రమోట్ చేసేలా బిల్ గేట్స్ సహకరించాలని కోరారు. గేట్స్ తో జరిగిన భేటీలో మంత్రి నారాలోకేశ్ ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. బిల్ గేట్స్ తో భేటీ తర్వాత తన ట్విట్టర్ లో చంద్రబాబు ఈ మీటింగ్ గురించి ఓ పిక్ ను షేర్ చేసుకున్నారు. 1995లో ఇద్దరూ ఐటీ గురించి మాట్లాడుకునే వాళ్లమని ఇప్పుడు 2025 లో అంటే  ముఫ్పై ఏళ్ల తర్వాత ఆర్టీఫిషియల్ ఇంటిలెజన్స్ గురించి మాట్లాడుకున్నామని ట్వీట్ చేశారు చంద్రబాబు. ముప్ఫై ఏళ్లు గడుస్తున్నా భవిష్యత్తు అవసరాలను ఊహిస్తూ ఈ ఇద్దరూ తమ రంగాల్లో విజన్ తో పనిచేస్తూ తగ్గేదేలా అంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola