CM Chandrababu About Yoga Day | ఏపీలో ఘనంగా యోగ డే నిర్వహిస్తున్న ప్రభుత్వం

ఈ నెల 21 తేదీన జరిగే యోగ డే కి సంబంధించి సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోడీ విశాఖపట్నంలో యోగ డేని సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. దాంతో ఘనంగా యోగ డేని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించబోతుంది ఏపీ ప్రభుత్వం.

ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది పాల్గొనేలా యోగాడేకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను సీఎం చంద్రబాబుకు వివరించారు. బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
607 సచివాలయాల సిబ్బంది ఈ యోగాడే కు హాజరవుతున్న వారిని సమన్వయం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola