సిక్కోలు జిల్లా లో ఘనం గా క్రిస్మస్ వేడుకలు
క్రిస్టమస్ వేడుకలు సిక్కోలు జిల్లా లో ఘనం గా జరుపుకుంటున్నారు. చర్చీలన్నింటీని ముస్తాబు చేశారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన చర్ఛిలు సైతం విద్యుత్ అలంకరణతో మెరిసిపోతున్నాయి.ఏసుక్రీస్తు జననాన్ని వివరిస్తూ ప్రదర్శనలు ,క్రిస్మస్ తాత వేషధారణల్లో చిన్నారులతో క్రిస్మస్ సందడి నెలకొంది. స్టార్స్ ,లైట్స్ అమర్ఛడంతో నగరమంతా సందడినెలకొంది. చర్చిలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో యేసు నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీకాకుళం నగరంతోపాటు పాలకొండ ,టెక్కలి ,వీరఘట్టం ,రాజాం ,పాతపట్నం ఇలా జిల్లా లోని అన్ని ప్రాంతాల్లో చర్చీలన్నీ ఏసుప్రభువును స్మరించుకున్నారు.
Tags :
Christmas 2021 Srikakulam Srikakulam News Christmas Celebration Srikakulam Christmas Celebrations