Temple Prasad Issue: జిలేబీ జగడం... ఆలయ అధికారి చెంప చెళ్లు!

Continues below advertisement

చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జిలేబీల, వడల తయారీపై వివాదం తలెత్తింది. వడలు, జిలేబీ ప్రసాదాల కోసం సెక్యురిటీ గార్డు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఘర్షణ పడ్డారు.  నిబంధనలకు విరుద్ధంగా జిలేబిలు, వడలు అధిక మొత్తంలో తయారుచేసినట్లు సెక్యురిటీ గార్డు ఆరోపిస్తున్నారు. ప్రసాదాలను టెంపుల్ ఇన్స్పెక్టర్ కుమార్ అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఘర్షణలో టెంపుల్ ఇన్స్పెక్టర్ కుమార్ పై సెక్యురిటీ గార్డు శ్రీనివాస్ చేయి చేసుకున్నాడు. టీటీడీ ఆధీనంలో‌ని వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram