Chevireddy Bhaskar Reddy vs Pulivarthi Nani | చంద్రగిరి దాడి ఘటనలపై పులివర్తి నాని vs చెవిరెడ్డి

Continues below advertisement

తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడి ఘటనపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటాపోటీ ప్రెస్ మీట్లతో మాటల దాడులకు దిగారు. ఏపీలో ఎన్నికల ముందు, తరువాత హింసాత్మక ఘటనలు జరగడం తెలిసిందే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద మే 14న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. దాడి ఘటనలో సంబంధం లేని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు చెప్పారు. సీసీ ఫుటేజ్ ని తిరుపతి ఎస్పీకి చెవిరెడ్డి అందజేశారు. వీడియో పరిశీలించి, ఆ దాడి ఘటనకు సంబంధం లేని వైసీపీ కార్యకర్తల్ని విడుదల చేయాలని ఎస్పీని కోరారు. ఏపీలో పోలింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, అనంతపురం జిల్లాల్లో హింస చెలరేగింది. చంద్రగిరి నియోజకవర్గంలో బ్రహ్మణ కాలువ వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు పార్టీల శ్రేణులు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కూచివారిపల్లిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మోహరించి పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు వైసీపీ సర్పంచ్ ఇంటిపై దాడి చేయడం అక్కడికి చేరుకున్న వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో పాటు అతని గన్ మ్యాన్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నేత ఇంటితో పాటు అభ్యర్ది కారును టీడీపీ నేతలు దగ్థం చేశారు. టీడీపీ అభ్యర్థి వచ్చి గన్ మ్యాన్‌ను విడిపించి బయటకు పంపగా.. కేంద్ర బలగాలు చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram