Chena poda Sweet Lavanya Kota | ఒడిషా బోర్డర్ లో దొరికే టేస్టీ స్వీట్ | ABP Desam
హైదరాబాద్ అంటే బిర్యానీ.. మందస పేరు చెబితే కోవా గుర్తుకొచ్చినట్టు..ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో ఉండే లావణ్య కోట పేరు చెబితే చెనా పొడ పేరు చెబుతారు. ఇంతకీ ఏంటీ చెనా పొడ..సంక్రాంతి సీజన్ లో ఆర్డర్లతో కళకళలాడిపోయే ఈ చిన్న దుకాణం ఎందుకంత ఫేమస్..ఈ స్టోరీలో చూసేయండి. ఎలా తయారు చేస్తారంటే... పాలు, పంచదార, గోధుమ నూక మిశ్రమంతో చెనా పొడను తయారు చేస్తారు. ఒక రోజుకు దాదాపు వంద లీటర్ల పాలు వినియోగిస్తున్నట్టు వీరు తెలిపారు. పాలు మరి గించి.. పంచదార పాకం తీసి.. గోధుమ నూక కలిపి దీనిని తయారు చేస్తారు. నిప్పులపై ఓ చిన్న పాత్రలో ఈ మిశ్రమాన్ని పోసి... కాల్చడం దీని ప్రత్యేకత. ఇలా తయారుచేసిన చెనా పొడను మంచి రుచికరంగా ఉంటుంది దీనిపై మంచి సమాచారాన్ని ఆంధ్రా ఒడిషా బోర్డర్ నుంచి మా ప్రతినిధి ఆనంద్ ఈ వీడియోలో అందిస్తారు