Chandrababu Visits Polavaram | ప్రతీ సోమవారం పోలవరం రోజుగా మళ్లీ పనులు మొదలు | ABP Desam
అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలియాత్రను పోలవరానికి చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతీసోమవారాన్ని పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు పనులను పరుగులుపెట్టించిన చంద్రబాబు మరోసారి అదే స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఆవిష్కరించిన పైలాన్ ను ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలను సూచించే శిలాఫలకాలకు మళ్లీ రంగులేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను గత ప్రభుత్వం రాబట్టుకోవటంలో ఆలస్యం వల్లే ప్రాజెక్టు నిర్మాణం నత్త నడకన సాగిందని..ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతు ఉండటం వల్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి చేయొచ్చని పోలవరం SE నరసింహమూర్తి తెలిపారు.సీఎం చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లను నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అధికారులతో సమావేశమైన నిమ్మల...ప్రాజెక్టులోని స్పిల్ వే, స్పిల్ ఛానల్, డయా ఫ్రం వాల్ పనులు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం పనులు పూర్తిగా నిలిచిపోయాయనని మండిపడిన మంత్రి..ఇకపై ప్రతీసోమవారాన్ని చంద్రబాబు పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తారని తెలిపారు.