Chandrababu Reaches Undavalli After 13 Hours: రాజమండ్రి నుంచి 13 గంటలు ప్రయాణించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి, నిన్న సాయంత్రమే మధ్యంతర బెయిల్ మీద విడుదలైన చంద్రబాబు, అక్కడ్నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే సాధారణంగా రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకోవడానికి ఓ నాలుగు గంటలు పడితే, చంద్రబాబుకు మాత్రం 13 గంటలు పట్టింది.