Chandrababu Pawan Kalyan Meeting: రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో ఏం చర్చించారు..?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు... తొలిసారిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఇరువురి మధ్య సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల వ్యూహాలే ప్రధాన అజెండాగా సమావేశం సాగింది. ఉమ్మడి మేనిఫెస్టో, సమన్వయంపైనా ప్రణాళికలు రచించారు. భేటీ వివరాలను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.