ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

Chandrababu on Whatsapp Governance: ‘‘ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఈ రాష్ట్ర యువత ఎదిగేందుకు, ఇంక్యుబేషన్ హబ్ ద్వారా అన్ని రకాలుగా, మా ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది. డీప్ టెక్నాలజీతో వివిధ మార్గాల ద్వారా డేటా సేకరించి, దీనికి ఏఐ జోడించి, రాష్ట్రంలోని ప్రతి సమస్యకు సులభమైన పరిష్కారాలు కోసం మా ప్రభుత్వం పని చేస్తుంది’’ చంద్రబాబు అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 6) చంద్రబాబు విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో జరిగిన ‘గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్‌ కాంక్లేవ్‌ ఆన్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్‌’ సదస్సుకు హజరయ్యారు. ‘షేపింగ్‌ ది నెక్స్ట్‌ ఎరా ఆఫ్‌ గవర్నెన్స్‌’ అనే అంశంపై చర్చ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఏపీ నాలెడ్జ్‌ హబ్‌గా నిలబెట్టాలన్న లక్ష్యం పెట్టుకున్నామని.. డీప్‌ టెక్‌తో ఉపాధి మార్గాలు, సంపదను సృష్టించగలమని అన్నారు. అభివృద్ధిలో మనల్ని వేగంగా నడిపించే ఈ సాంకేతికత కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి తాము రెడీగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola