Budget Allocations for AP and Bihar | మోదీ బడ్జెట్ ట్రైన్...ఏపీ, బీహార్ లో లూటీ | ABP Desam

Continues below advertisement

వార్షిక బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  44 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..ఈసారి బడ్జెట్ మొత్తం ఏపీ, బీహార్ కోసం కేటాయింపులు ఉన్నట్లు ప్రకటించారు. ఎందుకంటే అటు బీహార్ కోసం స్పెషల్ ప్రాజెక్టులు, వేల కోట్ల రూపాయల కేటాయింపులు...సేమ్ ఇటు ఆంధ్రప్రదేశ్ కోసం అదే స్థాయిలో కేటాయింపులు, వరాల జల్లు కురింపించింది కేంద్రం. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని బహిరంగంగానే ఎన్డీయే గవర్నమెంట్ ను కార్నర్ చేస్తుంటే...చంద్రబాబు స్పెషల్ స్టేటస్ అనే పదం తీసుకురాకపోయినా సైలెంట్ గా స్టేట్ కి కావాల్సిన రాబట్టాలనే ప్లాన్స్ ను ఫర్ ఫెక్ట్ గా ఎక్స్ క్యూట్ చేశారు. ప్రతిపక్ష ఇండీ కూటమి భయం, నితీశ్, బాబులను వాళ్లు ఆకర్షిస్తే చాలు...అధికారం తారుమారు కావచ్చన్న ఆలోచనలు అయ్యి ఉండచ్చు...ఎప్పుడూ లేనిది ఆంధ్రపై అమాంతం ప్రేమ పుట్టుకువచ్చింది బీజేపీకి. తెలుగు వాళ్లుగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా విభజన హామీలు సమస్యలు న్న ఆంధ్రాతో పాటున్న తెలంగాణను విస్మరించి కేవలం ఆంధ్రాకే గ్రాంట్స్ ప్రకటించటం..అమరావతికి 15వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామనటం..ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్స్ కోసం ఇస్తామంటున్న నిధులు..పోలవరం నిర్మాణంలో అందిస్తామన్న సహకారం ఇవన్నీ బడ్జెట్ లో ఏపీ పై ప్రత్యేక ప్రేమను చాటి చెబుతున్నాయి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram