Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండి
Chandrababu Naidu Escape Train Accident | ప్రతీ వ్యక్తి లో ఒక మాస్ ఒక క్లాస్ ఉంటాడు. ఇది చంద్రబాబు మాస్. లేకపోతే ఒక NSG ప్రొటెక్టీ. భద్రతా పరంగా దేశంలో నే అత్యంత జాగర్తగా ఉండాల్సిన నేతల్లో ఒకరైన చంద్రబాబు ఇలా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి NSG కూడా ఒప్పుకోదు. నిన్న కూడా ఒప్పుకోలేదు. కానీ చంద్రబాబు అవన్నీ పట్టించుకోలేదు. 70కి పైబడిన వయసు.. 20ఏళ్ళు సీఎం గాఁ ఉన్న అనుభవం.. 45ఏళ్ళ సుధీర్ఘ రాజకీయ చరిత్ర ప్రజల కోసమే ఆలోచించేలా చేశాయి. బుడమేరు ప్రవాహ ఉధృతి స్వయంగాఁ తెలుసుకోవాలంటే ఆ రైలు బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. బ్రిడ్జి మీద ఉన్నప్పుడు ట్రైన్ వచ్చే అవకాశం ఉందని తెలుసు. ఆయన పర్లేదు అన్నారు. రైల్వే వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంటే కూడా పది నిముషాలు చూసి వెళ్ళిపోతా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు అంట. తీరా ట్రైన్ వచ్చింది. ఆయన కంగారు పడకపోగా మిగిలిన వాళ్లందరిని పట్టాల మీద లేకుండా చూసుకున్నారు. తనలోని మాస్ ని బయటకి తీసి ఏదో యూనివర్సిటీ లో చదువుకునే కుర్రోడిలా కాసేపు రైలు పక్కన నిలబడి రిస్క్ చేశారు. ఇదంతా మనకు కామన్ కావచ్చు. కానీ ఆయనకు కాదు. ఏదైనా నాయకుడు అంటే ప్రజల కోసం నిలబడాలి. ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. ఇలాంటి అరుదైన ఘటనలే దానికి ఉదాహరణ