Chandrababu Landed in Hyderabad | విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బాబు
ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికాకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఎన్నికల ముందు కంటికి చికిత్స చేయించుకున్న చంద్రబాబు..మెరుగైన వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నట్లు టీడీపీ పర్యటనకు ముందు ప్రకటించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు కార్యకర్తలు, టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ఓటమి తెలిసిన కారణంగానే చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారని వైసీపీ నేతలు కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ కూడా లండన్ పర్యటనలో ఉండటంతో టీడీపీ వాటిని తిప్పికొడుతూ వస్తోంది. తిరిగి చంద్రబాబు జగన్ కంటే ముందే హైదరాబాద్ కు చేరుకోవటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు.
ఎన్నికల ఓటమి తెలిసిన కారణంగానే చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారని వైసీపీ నేతలు కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ కూడా లండన్ పర్యటనలో ఉండటంతో టీడీపీ వాటిని తిప్పికొడుతూ వస్తోంది.