Chandrababu Guntur Sabha stampede : గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక సంబరాల్లో విషాదం | ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు లో నిర్వహించిన సభలో మరోసారి విషాదం నెలకొంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక అనే కార్యక్రమాన్ని ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనగా ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.