దేవుడి ఫోటోలతో డైవర్షన్ గేమ్.. ఈ స్కెచ్ మాములుగా లేదుగా...!
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కేటుగాళ్ల నయా స్కెచ్ వేశారు. ఆటో ఆపిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దేవుళ్ల ఫోటోలను తీసుకెళ్తున్నామని అబద్ధాలు చెప్పారు. చెక్కపెట్టెలు దించి చెక్ చేస్తే అసలు వాస్తవం తెలిసింది. దేవుళ్ల ఫోటోల మాటున గంజాయి అక్రమరవాణా చేశారు కేటుగాళ్లు. 122 కేజీల గంజాయిని గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ సహా ఇద్దరి అరెస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి ఈ దందా సాగిస్తున్నట్లు అంగీకారించారు నిందితులు.