Breaking News | AP Govt Key Decision: రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలను దృష్టిలో పెట్టుకుని... ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ర్యాలీల వల్ల ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అరుదైన కేసుల్లో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.