Borugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

 గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు అందిన రాచమర్యాదలకు సంబంధించిన మరో వీడియో వెలుగు చూసింది. అరెస్ట్ చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు గతనెలలో తరలించిన పోలీసులు అక్కడ బోరుగడ్డకు సకల సౌకర్యాలు కల్పించారు. దుప్పటి దిండు ఇచ్చి ప్రత్యేక బెడ్ ను కల్పించిన వీడియోలు గతంలో వెలుగు చూడగా..అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన వ్యక్తి...దర్జాగా స్టేషన్ లో కుర్చీలో కూర్చోవటం బయట నుంచి కుటుంబసభ్యులు వచ్చి బోరుగడ్డను కలిసి వెళ్లిన సీసీటీవీ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఫుటేజ్ ప్రకారం గతనెల 20వ తారీఖున రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఓ పిల్లాడు వచ్చి బోరుగడ్డను కలిసి కుర్చీలో కూర్చుని చాలా సేపు మాట్లాడి వెళ్లాడు. అక్కడున్న పోలీసులు దగ్గరుండి ఆ పిల్లాడిని బోరుగడ్డకు కల్పించగా ఆ పిల్లాడు తన మేనల్లుడు అని చెప్పటం సీసీటీవీ కెమెరాలో ఆడియోతో సహా రికార్డైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola