Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABP
బొబ్బిలి. ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు తాండ్రపాపారాయుడు. తెలుగు చరిత్రలో విశిష్ఠమైన స్థానం ఉన్న బొబ్బిలి యుద్ధం. సరే ఇప్పుడు రాజులు పోయారు..రాజ్యాలు పోయాయి. నాటి వారసత్వ సంపదక, చారిత్రక ఆనవాళ్లు మాత్రం నేటి నాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. అలా సందర్శకులను ఆకర్షిస్తున్నదే బొబ్బిలి మ్యూజియం. బొబ్బిలి యుద్ధం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది. బొబ్బిలి యుద్ధం ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా ఇక్కడే తీశారు. నాటి యుద్ధంలో వాడిన కత్తులు. వారు వాడిన బాణాలు, బాకులు అన్నీ కూడా ఇదిగో ఇలా మ్యూజియంగా ఏర్పాటు చేశారు బొబ్బిలి రాజ వంశస్తులు. కొన్ని విశాఖపట్నం మ్యూజియంలోకి తరలించగా చాలావరకు బొబ్బిలిలోనే ఉంచి కోటకు వచ్చిన సందర్శకులకు తమ చరిత్రను పరిచయం చేస్తున్నారు. తమ పూర్వీకులు ఈ గడ్డకు అందించిన సేవలు, వాళ్ల వైభవానికి ఇవన్నీ గుర్తులని చెబుతున్నారు..బొబ్బిలి ఎమ్మెల్యే, రాజ వంశస్థులు బేబి నాయన. కేవలం కత్తులు కటారులే కాదు బొబ్బిలి రాజవంశపు ఠీవిని పరిచయం చేసే వింటేజ్ కార్లను కూడా ఇక్కడ చూడొచ్చు. 1960నాటి ఫోర్డ్ కంపెనీ వాళ్లు తయారు చేసిన లింకన్ కాంటినెంటల్, షెవర్లే కంపెనీ 1940ల్లో తయారు చేసిన స్పెషల్ డీలక్స్ సెడాన్ కార్లు, డిసోటో వాళ్ల డిప్లోమాట్స్ లాంటి పాతతరం కార్లను ఇక్కడ చూడొచ్చు.