Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam
బొబ్బిలి కోట అందరికి తెలుసు. దానికెంత చరిత్ర ఉందో బొబ్బిలి రాజావారి గెస్టు హౌస్ కు ఓ చరిత్ర ఉంది. నిజమైన జంతుచర్మాలతో కళాఖండాలు దర్శనమిస్తాయి. రాజుల కాలంలో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ గురించి ఒక్క మాటలో చెప్పడం అలవీకాదంటు ఆప్రాంతీయులు చెప్తున్నారు. రాజుల కాలపు కోటను మించి ఈ బొబ్బలి గెస్ట్ హౌస్ కున్న ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం..బొబ్బిలిరాజుల చరిత్ర ఎంత చెప్పిన తక్కువ. 265 సంవత్సరాల క్రితం అంటే 1757, జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఒకవైపు వందల మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం, మరోవైపు వేలమంది సైన్యం, విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం... ఒకరితో ఒకరు తలపడ్డ యుద్ధం ఇప్పటికి కధలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఆ యుద్ధం ఒక్కరోజులోనే ముగిసింది. కానీ రెండున్నర శతాబ్ధాలు గడిచినా ఇంకా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అంతే ప్రాధాన్యత అక్కడి గెస్టు హౌస్ కు ఉంది. 1927 సంవత్సరంలో ఈ అతిధి గృహం పనులు ప్రారంభించి మూడేళ్లలో నిర్మించారు.