Bikes Explosion With Fire Crackers Eluru | దీపావళి పండుగ రోజు ఏలూరులో దారుణం | ABP Desam

  దీపావళి పండుగ రోజు ఏలూరులో దారుణం జరిగింది. ఉల్లిపాయల బాంబులు పేలి ఓ మనిషి ముక్కలైపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.  ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబుల బస్తాను ఇదిగో ఇలా ద్విచక్ర వాహనంలో ఇద్దరు వ్యక్తులు తీసుకువెళ్తున్నారు. ఎందుకో తెలియదు కానీ బస్తా బస్తా ఒక్కసారిగా పేలిపోయింది. అంతే ఉల్లిపాయ బాంబుల బస్తాను ఒడిలో పెట్టుకున్న సుధాకర్ అనే వ్యక్తి ముక్కలు ముక్కలుగా పేలిపోయాడు. ఆయన శరీరం మొత్తం చిధ్రమైపోయింది. గుడి దగ్గర నిలబడిన ఐదుగురికి గాయాలయ్యాయి. ఊహించటానికి కూడా వీలులేని ఈ ఘటన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.దీపావళి పండుగ రోజున ఏలూరులో విషాదకర సంఘటన జరిగింది. ఉల్లిపాయ బాంబులు పేలడంతో ఒక వ్యక్తి దుర్మరణం చెందడం అందరిని కుదిపేసింది. ఏలూరు తూర్పు వీధిలోని గంగానమ్మ గుడి వద్ద, ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఉల్లిపాయ బాంబుల బస్తాను తీసుకెళ్తున్నారు. ఏమైందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఆ బస్తా పేలి పోయింది. సుధాకర్ అనే వ్యక్తి ఒడిలో ఉన్న బస్తా పేలిపోవడంతో, ఆయన శరీరం చిద్రమైపోయింది. గుడి వద్ద ఉన్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ భయానక ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola