నేటి నుండి ఐదు రోజుల పాటు ఇంద్ర‌కీలాద్రి పై భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ మ‌హోత్స‌వాలు

జై భ‌వానీ...జై జై భ‌వానీ నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో ఇంద్ర‌కీలాద్రి ప‌రిస‌రాలు ప్ర‌తిధ్వ‌నించాయి. భ‌వానీ మండ‌ల దీక్ష విర‌మ‌ణ ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా భ‌వానీ దీక్ష‌లు స్వీక‌రించిన భ‌క్తులు తెల్ల‌వారుజాము నుంచే వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో క్యూ లైన్ల‌న్నీ భ‌వానీల‌తో కిక్కిరిసాయి. మంచి ఘ‌డియ‌లు వ‌చ్చిన త‌ర్వాత ఉద‌యం 8 గంట‌ల నుంచి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తించారు. అనంత‌రం వేద‌పండితులు, అర్చ‌క బృందం అమ్మ‌వారి గ‌ర్భాల‌యం నుంచి నిప్పును తీసుకువ‌చ్చి హోమగుండాల్లో ఆల‌య స్థానాచార్యులు విష్ణుభొట్ల శివ‌ప్ర‌సాద్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అర్చ‌క‌బృందం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అగ్ని ప్ర‌తిష్టాప‌న చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola