Bandi Sanjay Comments on TTD | శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్

శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. భారత నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు బండి సంజయ్. టీటీడీ లో అన్యమతుస్థలకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి… కొనసాగించడం ఏంటి…? త్వరలోనే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో దుపదీప నైవేద్య నోచుకోని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది.  అనేక పురాతన దేవాలయాల  అభివృద్ధికి టీటీడీ తోత్పాటు అందించాలి ... కరీంనగర్ లో దేవాలయం నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు . శ్రీవారి ఆలయ నిర్మాణం తో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్న . మన ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి . స్వామి వారిపై నమ్మకం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని అన్నారు బండి సంజయ్ . బయటకు వస్తేనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా…?? టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి .. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు… ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలి అని అన్నారు బండి సంజయ్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola