Balakrishna Padayatra To Assembly: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీకి టీడీపీ పాదయాత్ర
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో... టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పార్టీ నాయకులందరూ వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై కక్ష, యువత భవితకు శిక్ష... కేసు ఎత్తేయకపోతే ప్రజా ఉద్యమమే అనే నినాదాలతో తెలుగుదేశం నాయకులంతా ముందుకు కదిలారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందుండి పాదయాత్రను నడిపించారు.