Bahuda river groin Re Construction : శ్రీకాకుళం జిల్లా ఈదుపురం రైతుల శ్రమ | ABP Desam
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురం బహుదానది గ్రోయిన్ పై ఆధారపడ్డ రైతులు తమ సమస్యను తామే పరిష్కరించుకున్నారు. సుమారు 7000 ఎకరాలకు పైగా పంట ఆధారపడ్డ గ్రోయిన్ ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్నా ఎవరూ పట్టించుకోకపోవటంతో రైతులు విసిగిపోయారు. చెయ్యి చెయ్యి కలిపి డబ్బులు పోగు చేసుకుని తామే సొంతంగా గ్రోయిన్ ను నిర్మించుకున్నారు. నేతలను నమ్ముకుంటే రైతులకు నష్టం తప్ప మరొకటి ఉండటం లేదని అందుకే తామే నిర్మించుకుని రైతులు తెలిపారు.