Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగిరిలో మొహరించిన కేంద్రబలగాలు | ABP Desam

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు దాడి చేయటంతో మొదలైన హింసాత్మక ఘటనలను అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు ప్రస్తుతం చంద్రగిరిలో 144సెక్షన్ ను విధించాయి. వారం వారం రోజు జరిగే సంతను రద్దు చేసిన పోలీసులు ప్రజలు గుంపులు గుంపులుగా తిరగటానికి వీలు లేదంటూ చంద్రగిరిలో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాని పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మరో వైపు చంద్రగిరిలో ఉద్రిక్తతలకు బాధ్యుడిని చేస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ను బదిలీపై పంపించిన ఎన్నికల సంఘం ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా కేంద్రబలగాలను చంద్రగిరిలో మొహరింపచేసింది. ప్రస్తుతం చంద్రగిరిలో పరిస్థితులను ఏబీపీ దేశం ప్రతినిధి గణేష్ ఈ వీడియోలో అందిస్తారు చూసేయండి 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola