Ashok Gajapati Raju : ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి ఉత్సవం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహ భాగ్యంగా భావిస్తున్నారు పైడితల్లమ్మ ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు.కరోనా ఉంది జాగ్రత్తలు పాటించాలి, కరోనాకు మతాలు ఉండవన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మం అని అన్నారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలి. పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు.