Ashok Gajapathi Raju: ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన అశోక్ గజపతి రాజు
విజయనగరం శ్రీపైడితల్లమ్మవారిని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అశోక్ ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు.