APNGO President: పీఆర్సీ అమలుపై రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వటం లేదు
పీఆర్సీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించినట్లు ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు.సోమవారం శ్రీకాకుళం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనమాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తమ డిమాండ్స్ నివేదించినా స్పందించడం లేదన్నారు.2018 సంవత్సరం నుండి పిఆర్సి అమలు చేయలేదని ఇప్పటి వరకు పిఆర్సీ రిపోర్టులు బయటపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.సిపియస్ ను రద్దు చేస్తామని పాదయాత్రలో సియం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేదన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.తమ డిమాండ్ ల పరిష్కారానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందన్నారు.ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశామని వాటిని కొన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని తాము ఏ పార్టీకి తోత్తులం కాదని ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామని అని ఆయన స్పష్టం చేశారు.