AP Minister Portfolios | Pawan Kalyan Deputy CM | మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి ఐటి, ఆర్టీజి శాఖలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కొన్ని కీలక శాఖలను కూడా ఆయన వద్ద ఉంచుకున్నారు. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తోపాటు మంత్రులకు కేటాయించని కొన్ని శాఖలు చంద్రబాబు వద్ద ఉన్నాయి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ ఊహించినట్టుగానే ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించారు.