AP Loksabha Exit Poll 2024 | YSRCP ను కాంగ్రెస్ దెబ్బకొట్టిందా.?
ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గాలి వీస్తోందని వెల్లడయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు మొత్తం ఇరవై ఐదు సీట్లను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే చెప్పారు. అయితే చాలా మంది కడప లోక్ సభ సీటులో వైఎస్ఆర్‌సీపీని ఎవరూ ఓడించలేరని భావిస్తున్నారు. కానీ ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ లో భిన్నమైన ఫలితం వస్తోంది.
కూటమికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వైఎస్ఆర్‌సీపీ కి సున్నా నుంచి నాలుగు సీట్లలో చాన్స్ ఉంది. అంటే నాలుగు సీట్లలో మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది.ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండవచ్చు. కడప ఇలా రిస్క్ లో పడటానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు షర్మిల అని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అడుగు పెట్టిన ఆమె.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. కడప లోక్ సభకు పోటీ చేశారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు చేశారు.