AP Liquor Scam Case | వైరల్ అవుతున్న నోట్ల కట్టల వీడియో
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఒక కీలక వీడియోను సేకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో A-34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే ఫోన్ లో డిలీట్ చేసిన వీడియోలను అధికారులు రికవర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతునట్టుగా వీడియో ఉంది. టేబుల్ పైన కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యారు.
అయితే ఈ వీడియోలో ఉన్న డబ్బు ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించినదని టీడీపీ ఆరోపిస్తుంది. కానీ వైసీపీ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఇది చాలా పాత వీడియో అని అంటుంది. ఆ వీడియోలో ఉన్న నోట్ల కట్టలో 2000 నోట్లు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధం లేని ఒక పాత వీడియోని చూపిస్తూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపిస్తుంది వైసీపీ.