అర్ద‌రాత్రి జీవోను ర‌ద్దు చేయాల‌న్న ఉద్యోగ సంఘాలు..స‌సేమిరా అంటున్న స‌ర్కార్

ఏపీలో ఉద్యోగ సంఘాలు,ప్ర‌భుత్వానికి మ‌ద్య చ‌ర్చ‌ల అంశం కీల‌కంగా మారింది.ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య జ‌ఠిలంగా మారింది.ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోలు వెన‌క్కి తీసుకోవాల్సిందేన‌ని ఉద్యోగులు అంటుంటే ముందు చ‌ర్చ‌ల‌కు రండి అంటూ ప్ర‌భుత్వ క‌మిటి అంటుంది.ఈ అంశం ఇప్పుడు రెండు వ‌ర్గాల మ‌ద్య తెగేదాకా లాగే ప‌రిస్దితులు వ‌చ్చాయి. చలో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్న టైం లో ఉద్య‌మం తీవ్ర‌త కూడ ప్ర‌భుత్వం గుర్తించాల్సి ఉంది.అయితే జీవో ను మాత్రం వెన‌క్కి తీసుకునే ప‌రిస్దితి లేద‌ని,ఆ ఒక్క‌టి అడ‌క్కు అంటున్నారు.ప్ర‌భుత్వ క‌మిటిలో మంత్రులు,బోత్సా,పేర్ని నాని కూడ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంశం తెర‌మీద‌కు రావ‌టంతో వారంతా కూడ అదే అంశం పై దృష్టి పెట్టారు.స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ విషయాన్ని భుజాన వేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola