AP Deputy CM Pawan Kalyan Palle Panduga | అసలేంటీ పల్లె పండుగ..పవన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటీ..?

Continues below advertisement

 సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ అండ్ స్వాగ్ తో యూత్ లో ఓ యూనిక్ స్థానాన్ని సంపాదించారు పవన్ కళ్యాణ్ అందుకే ఆయన్ను అంతా పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడీ పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారా. ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పల్లె పండుగ టార్గెట్స్ ఏంటో చూస్తో ఇది నిజమే అనిపిస్తుంది.  గ్రామీణ అభివృద్ధి కోసం తనదైన స్టైల్ లో ప్రత్యేకమైన ప్రణాళికలు రచించుకుని దూసుకెళ్తున్నారు. అసలేంటీ పల్లెపండుగ..ఎందుకు ఇదంత ప్రత్యేకం..ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆగస్టు 23న ఏపీలో ఓ భారీ కార్యక్రమం జరిగింది. అదే రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ. 13,326 గ్రామపంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలను నిర్వహించటం ద్వారా రికార్డును సృష్టిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డును అందుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ రోజు గ్రామ పంచాయతీల్లో చేసుకున్న తీర్మానాలు...లిస్ట్ అవుట్ చేసిన పనులు..ప్రారంభించటానికి నిధులు కేటాయించుకోవటానికి శంకుస్థాపనలకు అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే పల్లెపండుగ. దసరా ముగిసిన తర్వాత ఆ పండుగ వాతావారణాన్ని మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఈ పల్లె పండుగను డిజైన్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram