ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్

తిరుమల లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే గట్టిగానే అక్షింతలు పడతాయి. నటుడు కార్తీ...అందుకే చాలా న్యాక్‌గా తప్పించుకోవాలని చూశాడు. తిరుమల లడ్డు వివాదం చాలా సెన్సిటివ్ ఇష్యూ అని కార్తీ చేసిన కామెంట్స్‌ చేశాడు. అయినా...దొరికిపోయాడు. మరో నటుడు ప్రకాశ్ రాజ్ పరిస్థితీ ఇంతే. టాపిక్ ఏదైనా సరే. ముక్కు సూటిగా మాట్లాడేస్తాడు ప్రకాశ్ రాజ్. అది హిందుత్వానికి సంబంధించిన విషయమైతే మరింత ఘాటుగా స్పందిస్తాడు. ఇప్పుడు తిరుమల లడ్డు గురించి కూడా ఇలాగే కామెంట్స్ చేసి ఇరుక్కుపోయాడు. ఈ వివాదం మొదలైన వెంటనే రియాక్ట్ అయ్యాడు ప్రకాశ్ రాజ్. లడ్డుని ఓ బాంబుగా పోల్చి చెబుతూ పోస్ట్ పెట్టాడు. "ఇప్పుడు ఎవరైనా ఏదైనా పేల్చేయచ్చు" అని కాస్త కవ్వించే ఫొటో పెట్టాడు. అదిగో అప్పటి నుంచి మొదలైన ఈ రచ్చ...ఇప్పుడు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌ వార్నింగ్ ఇచ్చేంత వరకూ వచ్చింది. ప్రకాశ్‌ రాజ్‌తో పాటు..పేరెత్తకుండానే కార్తీని కూడా ఇన్‌డైరెక్ట్‌గా మందలించారు పవన్. సనాతన ధర్మం అంటే వేళాకోళమా..అని చాలా గట్టిగానే ప్రకాశ్ రాజ్‌ని హెచ్చరించారు. అంతకు ముందు పవన్ కల్యాణ్‌ తిరుమల లడ్డు వివాదంపై ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ సమయంలోనూ ప్రకాశ్ రాజ్.. ఆ ట్వీట్‌ని ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola