వాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో బాగా పేరున్న జాబ్ ఏంటి అంటే చాలా మంది చెప్పిన వేరు వాలంటీర్. ఈ పోస్ట్ మీద వచ్చినన్ని ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో మరో జాబ్ మీద రాలేదేమో. అసలు జగనన్న అయితే ఇది పదవి..ఉద్యోగమా..సేవనా కూడా చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఫస్ట్ లో అంతా ఇది ఉద్యోగం అనుకుని జాయిన్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికీ తీసుకువెళ్లవటం..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉండటం ఇది క్లుప్తంగా వాలంటీర్లు చేయాల్సిన పని. పదోతరగతి, ఇంటర్ అర్హతతో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లను వాలంటీర్లుగా నియమించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఐదు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ పథకాలను వాటి ఫలితాలను వాళ్లకు కేటాయించిన ఇళ్లకు చేరవేయటం వాలంటీర్ల బాధ్యత. వైసీపీ ఉన్నప్పుడే వాలంటీర్లు తమ జీతాలు పెంచాలని ఓసారి ఆందోళన చేశారు. అప్పుడు స్వయంగా జగనే ప్రెస్ మీట్ పెట్టి మీది ఉద్యోగం కాదు బాధ్యత...ఇది ఓ రకమైన సేవ అనుకోండి అని చెప్పారు. మన ప్రభుత్వానికి మేళ్లు చేయాలి ప్రజలకు మీరు ఉపయోగపడాలి బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు జరిగాయి. స్థానికంగా ఉన్న సచివాలయాలను బేస్ చేసుకుని ఈ వ్యవస్థ పనిచేసింది. వీళ్లు పాపం ఎంత పనిచేశారో లేదా చేయించుకున్నారో తెలియదు భారీగా ట్రోలింగ్ అయ్యారు. ఎవరో గంజాయి కాశాడని మొత్తం వాలంటీర్లను అన్నారు.