ప్రకాశం జిల్లా లో బ్రాందీ షాపు వద్ద మందుబాబులు పూజలు.
AP లో మందు రేట్లు తగ్గించడంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో బ్రాందీ షాపు వద్ద మందుబాబులు అనందంతో మద్యం షాప్ లకు పూజలు చేసి మద్యం కోనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులపై కాస్త కనికరం చూపించింది. మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా ఇరవై శాతం వరకూ మద్యం ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరించారు. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది.