పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన బొత్స, నూతన విద్యావిధానంపై స్పందన
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా పాస్ పర్సెంట్ నమోదైంది. నూతన విద్యావిధానంపై మంత్రి బొత్స స్పందించారు. స్కూళ్ల విలీనం జరగలేదని, కేవలం క్లాసుల విలీనం జరిగిందని స్పష్టం చేశారు.