Anganwadis Play Kabaddi: కబడ్డీ ఆడిన అంగన్వాడీలు.. జగన్ ను అనుకరిస్తూ 'నేను విన్నాను, నేను ఉన్నాను' అని కూత
సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన 22వ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు వినూత్నంగా తమ నిరసన తెలియచేశారు. హామీలు నెరవేర్చకపోవడంపై పాటలు పాడారు, కోలాటాలు ఆడారు. ఆ తర్వాత రెండు జట్లుగా విడిపోయి రోడ్డుపైనే కబడ్డీ కూడా ఆడారు. కూతలేంటో తెలుసా.. నేను ఉన్నాను, నేను విన్నాను అనేది ఓ కూత. ఇంకొకటి... జగనన్న మా డిమాండ్లు నెరవేర్చు అని. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.