గోవా టూరిజం గురించి వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. మొదట గోవా టూరిజం సమస్యలు ఎదుర్కొంటోందని, టూరిస్టులకు భద్రత సమస్యలు ఉన్నాయనే కథనాలు వెలువడ్డాయి. అయితే అలా వచ్చిన వార్తలు తప్పుడు సమాచారం అంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. గోవా టూరిజం సూపర్, అన్నీ సజావుగా సాగుతున్నాయని చెబుతూ పలు పోస్టులు షేర్ అవుతున్నాయి.
అయితే, ఈ పరిస్థితుల్లో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, రవితేజ అనే తెలుగు యువకుడు గోవాలో ప్రాణాలు కోల్పోవడం వెనుక నిజమైన కారణం ఏంటీ? టూరిజం సూపర్ అని చెబుతున్న వారు గోవా టూరిజం సేఫ్ అని ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? రవితేజ మరణం వంటి ఘటనలు టూరిస్టులకు భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఈ విషయంలో గోవా అధికారుల నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
టూరిస్టులు పెద్ద ఎత్తున గోవాకు వెళ్లే పరిస్థితుల్లో భద్రత అనేది ప్రాధాన్యత పొందాలి. రవితేజ మరణానికి కారణాలు వెలుగులోకి రాకుండా ఫేక్ న్యూస్ ప్రచారంతో టూరిజం అభివృద్ధికి మద్దతు లభించదు. ఇది సవాలుగా మారడంతో పాటు, భవిష్యత్‌లో టూరిస్టులు గోవాకు వెళ్ళే ముందు ఆలోచన చేయాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు.